కేంద్ర ప్రభుత్వం ఎంత లేదు అనుకున్నా గత ఒక్క నెలలో చమురు ధరలపై దాదాపుగా 10 రూపాయలకు మించి పెంచారు. పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవడం కన్నా వాహనాలను ఇంట్లో పెట్టుకొని నడుస్తూ వెళ్ళడం మేలు అని భావిస్తున్నారు వాహదారులు. పెట్రోల్ డీజిల్ కొట్టించలేక లబోదిబో మంటున్నారు. ఇక వారి కష్టాలను చూస్తున్న కాంగ్రెస్ అధిష్టానం వారి చెంత నిలబడి పోరాటం చేసేందుకు నిర్ణయించింది. ఈమేరకు తెలంగాణ టీపీసీసీ ప్రెసిండెంట్ ఉత్తమ్ కుమార్ నేడు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా దార్నాలు చేయాలను కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. ఆయన తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా లైవ్ లో మాట్లాడుతూ ఈమేర పిలుపునిచ్చారు.
ఇక మరో అంశం పై కూడా ఆయన స్పందించారు. తెలంగాణ రాష్ట్రం లో నాన్ టెలిస్కొపీక్ విదానంలో తీస్తున్న బిల్లులు పేద ప్రజలకు భారం అవుతున్నాయని వారు అంత ఛార్జీలు కట్టలేకపోతున్నారని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో అడ్డగోలుగా విధించిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తామన్నారు. మండల విద్యుత్ కార్యాలయాల ఎదుట నల్ల జెండాలతో ధర్నా చేయనున్నట్లు ఉత్తమ్ ప్రకటించారు. కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో విద్యుత్ బిల్లులను అడ్డగోలుగా వేశారన్నారు. రావాల్సిన బిల్లు కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగానే బాదారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జులై 6న రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారంపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగర వేయాలని టీపీసీసీ చీఫ్ సూచించారు. వాహనాలకు సైతం నల్ల జెండాలు కట్టుకోవాలన్నారు.