బీసీలను నా గుండెల్లో పెట్టుకున్నా..రూ.1.63 లక్షల కోట్లు ఖర్చు చేశా – సీఎం జగన్‌

-

బీసీలను నా గుండెల్లో పెట్టుకున్నా.. BC లకు 1.63 లక్షల కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు సీఎం జగన్. ఇంటికో ఉద్యోగం అని చెప్పి చంద్రబాబు యువతను మోసం చేశాడని ఫైర్‌ అయ్యారు సీఎం వైఎస్‌ జగన్‌. 2024 లో 46 వేల ఉద్యోగాలు ఆరో గ్య రంగంలో ఇచ్చాం, కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ తీసుకుని వచ్చిందని పేర్కొన్నా రు.

మన ప్రభుత్వం, విద్యా, మహిళా సాధికారత తీసుకుంటే దేశంలో ఏ రాష్ట్రం మనకు దరిదాపుల్లో లేదన్నారు సీఎం వైఎస్‌ జగన్‌. 2014-19 మధ్య చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు.. రాజ్యాధికారంలో బీసీలు భాగస్వామ్యమని చంద్రబాబుకు చెప్పండి, చంద్రబాబు హయాంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వారికి గుర్తుచేయండని కోరారు సీఎం జగన్‌.

పాదయాత్రలో బీసీల ఆకాంక్షలను తెలుసుకున్నా.. మన ఇంట్లో ప్రతి వస్తువు బీసీలు తయారు చేసేవే.. నాగరికతకు పట్టుకొమ్మలు బీసీలు.. రాజ్యాధికారంలో బీసీలు భాగస్వామ్యమని చంద్రబాబుకు చెప్పండన్నారు వైఎస్‌ జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news