బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదు..బీసీలంటే వెన్నముక కులాలు – సీఎం జగన్

-

బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదు..బీసీలంటే వెన్నముక కులాలు అని పేర్కొన్నారు ఏపీ సీఎం జగన్. విజయవాడలో జరిగిన జయహో బీసీ సభలో సీఎం జగన్‌ మాట్లాడారు. బీసీ అంటే శ్రమ, బీసీ అంటే పరిశ్రమ అని సీఎం జగన్ కొనియాడారు.

‘బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు. బీసీలు అంటే వెన్నెముక కులాలు. నా బీసీ కుటుంబం, జన సముద్రంలా వుంది. మీ హృదయంలో జగన్, నా హృదయంలో మీరు. ఈ దేశ సాంస్కృతికి ఉన్నంత చరిత్ర బీసీలకు వుంది. నాగరికతకు పట్టుకొమ్మలు బీసీలు. ఉన్నత విద్యను దూరం చేయడం వల్లే బీసీలు వెనుకబడ్డారు’ అని విజయవాడలో జరిగిన జయహో బీసీ సభలో జగన్ వెల్లడించారు.

టీడీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది.. బీసీలు వైసీపీకి దగ్గరవుతున్నారు.. బీసీలు రాజకీయ సాధికారతకు నిదర్శనంగా నిలిచారు.. బీసీల హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో బీసీలున్నారని పేర్కొన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news