హీరో సత్యదేవ్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా..?

-

తెలుగు సినీ ప్రేక్షకులకు విభిన్నమైన చిత్రాలతో మెప్పించ గలిగే హీరోలలో నటుడు సత్యదేవు కూడా ఒకరు. ప్రస్తుతం వరుస గా సినిమాలతో దూసుకుపోతున్నారు. నటుడిగా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న సత్యదేవ్ హీరోగా నటించిన గుర్తుందా సీతాకాలం సినిమా ఈనెల 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి నాగశేకర్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్ పనులలో బిజీగా ఉంటోంది. ఈ సినిమాకి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు చిత్ర బృందం

ఈ సందర్భంగా హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. మరి మీ రియల్ లైఫ్ లో హీరోయిన్ ని పరిచయం చేయొచ్చు కదా అని తమన్నా సత్యదేవ్ ను అడగగా.. అంతేకాకుండా తమన్నా మాట్లాదుతు మీరు ఇంత స్టైలిష్ గా కనిపించడానికి ప్రధాన బలం కూడా ఆమెను అట కదా అని అడగగా.. దీని తర్వాత సత్యదేవ్ బేబీ అంటూ స్టేజి మీదకి తన భార్యను పిలవడం జరిగింది. దీంతో సత్యదేవ్ భార్య కొడుకు స్టేజ్ పైకి రాగానే.. వారిద్దరిని పలకరించింది తమన్నా.

సత్యదేవ్ తన భార్య గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తన భార్య తనకు కాస్ట్యూమ్ డిజైనింగ్ తో పాటు, స్టేలింగ్ కూడా దీపికానే చేసిందంటూ తెలియజేశారు. దీంతో స్టేజి మీద తన భార్యకు కూడా కృతజ్ఞతలు తెలిపారు సత్యదేవ్. దీపిక సత్యదేవ్ ఇద్దరిదీ కూడా ప్రేమ వివాహమే నట. సత్యదేవ్ సినిమాలకు దీపిక కాస్టింగ్ డిజైనర్గా వ్యవహరించడంతో ప్రస్తుతం సత్యదేవ్ భార్యకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.సత్యదేవ్ భార్యలో ఇంతటి టాలెంట్ ని చూసి అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news