కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విషమం.. సీఎం జగన్ ఫోన్‌ !

అమరావతి : ప్రముఖ సినీ నటుడు, సీనియర్ నేత కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరా తీశారు. కైకాల సత్యనారాయణ కుమారుడికి ముఖ్యమంత్రి జగన్ ఫోన్… చేసి.. ఆయన ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసు కున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల.. ప్రస్తుతం ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు.

ఈ నేపథ్యంలోనే… కైకాల సత్యనారాయణ కుమారుడికి ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు కనుక్కున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్ మోహ న్‌ రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు కైకాల సత్యనారాయణ. కాగా.. ఇవాళ ఉదయమే కైకాల సత్యనారాయణ హెల్త్‌ బులిటెన్‌ ను అపోలో ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం కైకాల సత్యనారాయణ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని.. ఆయన ఆరోగ్యం పై ఎవరూ ఆందోళన చెంద నవసరం లేదని అపోలో ఆస్పత్రి వైద్యులు చెప్పారు.