ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల టీచర్లు సీఎం జగన్ శుభవార్త !

-

అమరావతి : కరోనా మహమ్మారి పై ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు వాక్సినేషన్‌ వేయడంపై సీఎం జగన్ మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లు తెరిచే ముందు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల టీచర్లు అందరికీ వాక్సినేషన్‌ ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

వాక్సిన్‌ అందుబాటును బట్టి డిగ్రీ విద్యార్ధులకు వాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టాలని… ఆయా కాలేజీల్లోనే క్యాంపులు పెట్టి వాక్సిన్‌ ఇవ్వాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. చాలా ఫోకస్డుగా కరోనా పరీక్షలు చేయాలని.. ఫీవర్‌ సర్వే అనంతరం ఫోకస్డుగా టెస్టులు చేయాలన్నారు.

ఎవరికైతే జ్వరం, ఇతర లక్షణాలుంటాయో వారికే పరీక్షలు చేసి.,.. తగిన మందులు అందించాలని పేర్కొన్నారు. కేసులు సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలన, తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలన్నారు. థర్డ్‌ వేవ్‌ వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పిన సీఎం జగన్…. చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తంగా ఉండాలని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news