కరోనా వచ్చినా నా ప్రజలకు పథకాలను ఆపలేదు: సీఎం జగన్

-

ఈ రోజు సామర్లకోటలో సీఎం జగన్ జగనన్న కాలనీలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇక్కడ జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ప్రఝల గురించి, పథకాల గురించి మరియు గత ప్రభుత్వ ఏ విధంగా ప్రజలకు పథకాలను దూరం చేసిందన్న విషయాలను పంచుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏ రోజూ కూడా ప్రజలపై కనికరం చూపింది లేదు ఎంతసేపు వారి స్వార్ధ ప్రయోజనాలు చూసుకోవడానికి సమయం సరిపోయిందంటూ ఆరోపణలు చేశారు సీఎం జగన్. చంద్రబాబు ప్రభుత్వం పేదలకు పట్టాలను ఇవ్వకుండా కోర్ట్ లలోకి వెళ్లి స్టే లు తెచ్చి ప్రజలకు మంచి జరగకుండా చేశారన్నారు జగన్. మీ జగన్ ప్రభుత్వంలో ప్రజలకోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన 35 పథకాలు సమర్ధవంతమగా పనిచేస్తున్నాయి అంటూ గొప్పగా చెప్పుకొచ్చారు జగన్. మా ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే పేదవాడి బ్రతుకులను మార్చడం, అందుకోసం ఎంత దూరమైన వెళ్తాము అంటూ జగన్ భరోసాను కల్పించారు.

గతంలో కరోనా వచ్చి దేశమంతా ఆర్ధికంగా కొట్టుమిట్టాడుతున్న సమయం లోనూ ప్రజలకు ఏ ఒక్క పధకాన్ని ఆపలేదు అంటూ జగన్ గర్వంగా చెప్పుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news