Phone Pay కాదు.. “రేవంత్ పే” పట్ల జాగ్రత్త.. : దాసోజు శ్రవణ్

-

రేవంత్ పే పట్ల జాగ్రత్త..ప్రమాదంలో తెలంగాణ భవిష్యత్తు అంటూ దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాష్ట్ర సమితి నేత దాసోజు శ్రావణ్ కుమార్… తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సెటైరికల్ ట్వీట్ చేశారు. ఒకప్పుడు సైదాంతికి పార్టీ ఇప్పుడు రాజకీయాలను డబ్బు సంపాదన, వాణిజ్య వ్యాపారం మాత్రమే తెలిసినట్లుగా ఉందంటూ ట్వీట్ చేశారు దశోజు శ్రవణ్ కుమార్. పార్టీ టికెట్లను అమ్ముకునే స్థాయికి దిగజారిందని ఫైర్ అయ్యారు.

dasoju sravan counter to revanth reddy
dasoju sravan counter to revanth reddy

కాంగ్రెస్ పార్టీ టికెట్లను రేవంత్ రెడ్డి అడ్డగోలుగాకు అమ్ముకుంటున్నారని నిప్పులు జరిగారు. ఈ పద్ధతి భారత దేశ రాజకీయ చరిత్రలో అపూర్వమైందన్నారు. ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకొని సొంత ఎమ్మెల్యేలను దోచుకుని దోపిడికి గురి చేస్తున్నారని దాసోజు శ్రవణ్ వెల్లడించారు. అందుకే రేవంత్ రెడ్డి పేపట్ల జాగ్రత్త… తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు రేవంత్ రెడ్డి చేతిలో బంధీ కావడం సిగ్గుచేటు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news