వైఎస్ఆర్ వర్థంతి..సీఎం షెడ్యూల్ ఇదే..!

సీఎం క్యాంపు కార్యాలయం తాడేపల్లి లో ఈరోజు ఉదయం 11 గంటలకు వ్యవసాయ శాఖ పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.అనంతరం సాయంత్రం 3:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుంటారు. వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి సీఎం బస చేస్తారు. రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి సందర్భంగా ఉదయం 9.35 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సీఎం నివాళులర్పించనున్నారు.

Jagan
Jagan

రేపు సీఎం మధ్యాహ్నం 12 :45 కు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఇదిలా ఉండగా రేపు వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా వై ఎస్ షర్మిల కూడా ఇడుపుల పాయకు వెళ్ళబోతున్నట్టు సమాచారం. అయితే షర్మిల జగన్ ను కలుస్తారా లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. కాగా షర్మిల…జగన్ లు వేరు వేరు సమయాల్లో ఘాట్ వద్ద ప్రార్థనలు చేయబోతున్నట్టు తెలుస్తోంది