ఈనెల 11, 12 వ తేదీలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే మోడీ పర్యటనపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రైల్వే లైన్స్ అభివృద్ధి నిలిచిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడమే కారణమని ఆరోపించారు. మోడీ సమక్షంలోనైనా సీఎం వైయస్ జగన్ ఈ నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇక ప్రధాని పర్యటనలో రాజధాని అంశం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం కేంద్ర ప్రభుత్వానికి చెందిన అంశాలే ఉంటాయన్న ఆయన.. రైల్వే జోన్ ను ఇప్పటికే ప్రకటించామని చెప్పారు. ఇది అధికారిక పర్యటన కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందించడంపై పీఎంఓ నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. కాగా ప్రధాని విశాఖ పర్యటనను చిన్న చిన్న రాజకీయాల కోణంలో చూడద్దని అన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఈ పర్యటనలో లేదని స్పష్టం చేశారు.