ఈనెల 6న చిలకలూరిపేటకు సీఎం జగన్

-

ఈ నెల 6 న చిలకలూరిపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. చిలకలూరిపేటలో ఈ నెల 6న ప్రతిష్టాత్మక ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో చిలకలూరిపేట రూరల్ మండలం లింగంగుంట్ల గ్రామంలో పర్యటించి ముఖ్యమంత్రి గారి పర్యటన కోసం చేయవలసిన ఏర్పాట్లను పరిశీలించారు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు విడదల రజిని,ఎమ్మెల్సీ తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి యం. టి కృష్ణబాబు,ఆరోగ్యశ్రీ సీఈఓ హరింద్ర,జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్,జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి శోభారాణి,మరియు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news