తనదైన స్పీడుతో తనదైన రూటులో దూసుకుపోతున్నాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంచి మిత్రుత్వం కలుపుకొని ఇరు రాష్ట్రాల మధ్య మంచి సంబంధం మైత్రి నిలిచేలా చేస్తున్నాడు. అభివృద్ధిపదంలో కొన్నిసార్లు కేసీఆర్ ని ఫాలో అవుతుంటాడు ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఇదే రీతిలో సీఎం కేసీఆర్ అమలు చేసిన ఓ పద్ధతినే జగన్ కూడా అమలు చేయబోతున్నాడు. సీఎం కేసీఆర్ గతంలో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల గల సంఖ్యను పెంచారు, ఇప్పుడు ఇదే పద్ధతిని ఫాలో అవుతూ జగన్ కూడా ఆంధ్రలోని రాష్ట్రాల సంఖ్యను పెంచనున్నాడు. ప్రస్తుతం ఏపీ లో ఉన్న జిల్లాల సంఖ్యను 13 నుండి 25 గా మార్చాలని జగన్ భావిస్తున్నాడు. మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడినా జగన్ ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన ఉందని అధికారులకు సీఎం వివరించారు. సీఎం జగన్ గనుక ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే ఇప్పుడు 13 జిల్లాలకు మరో 12 జిల్లాలు జతయ్యి మొత్తం 25 జిల్లాలు ఏర్పడతాయి.
కేసీఆర్ ను ఫాలో అవుతున్న జగన్..! ఏపీలో 12 కొత్త జిల్లాలు..!
-