అమరావతి సీఆర్డీఏ పరిధిలోని వెంకటపాలెంలో సీఎం జగన్ నేతృత్వంలో జరుగుతున్న బహిరంగ సభలో ఆ ప్రాంత ప్రజల గురించి మరియు బాగోగుల గురించి ఎంతగానో ఆలోచిస్తున్న ఏపీ పర్బహుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన పన్నాగాలను గురించి జగన్ అన్ని విషయాలను బట్టబయలు చేశారు. జగన్ మాట్లాడుతూ.. రాజధాని అని చెప్పుకుంటున్న అమరావతిలో పేదలకు ఇల్లు ఇస్తుంటే చూసి తట్టుకోలేని చంద్రబాబు కేసులు పెట్టడానికి కోర్ట్ లకు వెళ్లిన పరిస్థితి మీరందరూ ఆలోచించాలి అన్నారు. ఇక్కడ మీకు ఇల్లు ఇస్తే అమరావతిలో అభివృద్ధి ఆగిపోతుందని అర్ధం లేని ఆలోచనలతో మా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని వాస్తవాన్ని తెలియచేసే ప్రయత్నం చేశారు. పేదల గురించి కనీసం సక్రమంగా ఆలోచన చేయలేని ఇలాంటి రాజకీయ పార్టీల గురించి మనము మాట్లాడుకోవలసి వస్తోంది అంటూ చంతించారు సీఎం జగన్.
మీరే ఆలోచించండి మీకోసం ఇంతగా ఆలోచిస్తున్న మీ ప్రభుత్వం ఇంకా మంచి చేయాలంటే మీ ఆశీర్వాదం కావాలన్నారు జగన్.