KTR బర్త్ డే స్పెషల్.. టమాటలు పంచిన బీఆర్ఎస్ నేత

-

నేడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఆయన జన్మదిన వేడుకలను వినూత్న రీతిలో జరుపుతున్నారు. కొందరు కేక్ కట్ చేసి.. పండ్లు పంచుతుంటే.. మరికొందరు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేటీఆర్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.

వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి కేటీఆర్ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. టమాటా రేటు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్న నేపథ్యంలో మహిళలకు టమాటలను పంచి పెడుతూ కేటీఆర్ జన్మదిన వేడుకలను జరిపారు. గతంలో దసరా సందర్భంగా రాజనాల శ్రీహరి… హమాలీలకు కోడితో పాటు మందు సీసాను అందజేశారు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా నిరుపేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. గత ఏడాది కేటీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా నగరంలోని వీధి వ్యాపారులకు గొడుగులను అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news