విభిన్న సంస్కృతులకు ఏపీ నిలయమని అన్నారు ఆ రాష్ట్ర సిఎం వైఎస్ జగన్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ చేసారు. మన గిరిజన వారసత్వ సంపద పట్ల గర్విస్తున్నామని అన్నారు. గాంధీ జయంతి రోజే ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ కురుపాం లో, మెడికల్ కాలేజ్, యూనివర్సిటీ ని పాడేరులో ప్రారంభిస్తామని చెప్పారు. వారి అభివృద్ధి తో పాటు వారి సంస్కృతి ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
గిరిజనులకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాల పంపిణీ కోవిడ్ కారణం గా అక్టోబర్ 2 కు వాయిదా పడిందన్నారు ఆయన. గాంధీ జయంతి రోజే ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ కురుపాం లో, మెడికల్ కాలేజ్, ట్రైబల్ యూనివర్సిటీ పాడేరులో ఆదే రోజు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. 7 ఐ టి డి ఏ ల లో 7 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లను అదే రోజు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కురుపాం నుంచి మంత్రి పుష్ప శ్రీవాణి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
On Gandhi Jayanthi, we will also lay the foundation of a Tribal Engineering College at Kurupam, a Medical College at Paderu & a Tribal University. Ground breaking for 7 super-specialty hospitals under each ITDA will also be done on that day. 2/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2020