అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే… ఇవాళ పార్టీ పలు అనుబంధ విభాగాలు, బీసీ కార్పొరేషన్ల తో సన్నాహక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనుబంధ విభాగాల, బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు హాజరుకానున్నారు.
అటు ముఖ్య అతిధిగా సజ్జల..హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నేతలకు పలు సూచనలు చేయనున్నారు సజ్జల. అలాగే, 15 వేల గ్రామ సచివాలయాల్లో సిగ్నేచర్ క్యాంపైన్ ఉండనుంది. ఈ నెల 19న విజయవాడలో నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్.