జీతాల పెంపు, రైతు రుణమాఫీపై త్వరలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.ఈనెల 31న సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ఉద్యోగులకు PRCపైన నివేదికకు మరింత టైం ఉండటంతో ఈ లోపు IR(మద్యంతర భృతి) ప్రకటించనున్నట్లు సమాచారం.
అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో లేని రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటారని అధికారిక వర్గాల్లో చర్చ సాగుతోంది. DSCతో పాటు ఫిబ్రవరిలో చేయూత, జగనన్న కాలనీల ప్రారంభంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
అలాగే, నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం ఈనెల 27 నుంచి వాటికి రిజిస్ట్రేషన్లు చేయనుంది. గ్రామ/వార్డు సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా….ప్రభుత్వం తరఫున వీఆర్వో రిజిస్ట్రేషన్ చేస్తారు. వచ్చేనెల 9వ తేదీ కల్లా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ కార్యక్రమం సజావుగా సాగేలా కలెక్టరేట్లలో ప్రభుత్వం కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయనుంది.