సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఇక వారికి నో ఎంట్రీ

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి డాక్యుమెంట్ రైటర్లకు ఇక నుంచి ఎంట్రీ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్ల సహా అనధికార వ్యక్తులకు ప్రవేశాన్ని నిషేధించారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజీ రామకృష్ణ. ఈ మేరకు మెమో జారీ చేశారు రామకృష్ణ. అనధికార వ్యక్తుల ప్రమేయం వల్లే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందన్న ఏసీబీ… డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్స్ వల్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం ఏర్పడుతోందని నివేదిక ఇచ్చింది.

jagan
jagan

తాము సీజ్ చేసిన లెక్కల్లోకి రాని నగదు డాక్యుమెంట్ రైటర్లు.. స్టాంప్ వెండర్ల ద్వారానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరిందని వెల్లడించింది ఏసీబీ. ఏసీబీ అబ్జర్వేషన్లను పరిగణనలోకి తీసుకున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజీ రామకృష్ణ… అనధికారిక వ్యక్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఐజీ ఆదేశాలపై డాక్యుమెంట్ రైటర్ల అభ్యంతరం చేస్తున్నారు. మొత్తం డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థనే అవినీతి వ్యవస్థగా చిత్రీకరించొద్దని డాక్యుమెంట్ రైటర్ల కోరుతున్నారు.