గోల్డ్ లేడీ నిఖత్ జరీన్​కు కేసీఆర్ అభినందనలు..

-

బర్మింగ్ హాంలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీల్లో, ఉమెన్స్ బాక్సింగ్ ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. జరీన్​తో స్వయంగా ఫోన్​లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె విజయపరంపరను అభినందించారు.

జరీన్ గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాపితమైందని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూనే వుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

కామన్వెల్త్‌ క్రీడల్లో నిఖత్‌ జరీన్ 48-50 కేజీల (లైట్‌ ఫ్లై) విభాగంలో పోటీ చేసింది. ఫైనల్​లో నార్తరన్‌ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై అద్భుత విజయం సాధించి పసిడి పతకం నెగ్గింది. బౌట్లో ఆరంభం నుంచే శివంగిలా విరుచుకుపడిన నిఖత్‌.. తన పవర్‌ పంచ్‌లతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఏడాది మే నెలలో ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లోనూ నిఖత్‌ అద్భుతమైన ప్రదర్శనతో బంగారు పతకం నెగ్గి తెలంగాణ కీర్తిని పెంచింది.

Read more RELATED
Recommended to you

Latest news