ఏ రంగంలో అభివృద్ధి చేయలేదు.. సిగ్గు చేటు : సీఎం కేసీఆర్‌

-

గత మూడు రోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు అధికారులు. అయితే ఇంకో మూడు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో ఉన్నతాధికారులుతో భారీ వర్షాలపై సీఎ కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు అందిస్తున్న సహాయక చర్యలు, భారీ వర్షల కారణంగా తీసుకున్న ముందస్తు చర్యలపై చర్చించారు. అయితే.. ఈ సమావేశం అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

అప్పుడు మీరు అడిగారు ఇప్పుడు మేము అడుగుతున్నాం సమాధానం చెప్పాలంటూ సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. రూపాయి విలువ ఇంత దరిద్రంగా ఎప్పుడు అయిన పడి పోయిందా.. సమాధానం చెప్పాలి… తప్పించుకోలేవు అంటూ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. 8 సంవత్సరాలలో ఈ దేశానికి చేసిన ఒక్క మంచి పని చెప్పండని, ఏ రంగంలో అభివృద్ధి చేయలేదని సిగ్గు చేటంటూ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. అసమర్థమైన పాలన.. ఒక్క తెలంగాణ తప్ప దేశం అంత కరెంట్ ఇచ్చుడు చేత కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్‌. మంచి నీళ్ళు ఇచ్చే తెలివి తేటలు కూడా లేవంటూ ఆయన ఆరోపించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version