నాగార్జునసాగర్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కొన్ని కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమందిని సీఎం కేసీఆర్ మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది సమర్థత ఉన్న నాయకులను క్యాబినెట్లోకి తీసుకునే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. సమర్థవంతంగా పని చేయని నియోజక వర్గాల్లో కూడా ఇన్చార్జిలను మార్చే ఆలోచనలో ఉన్నారు.
ఈ విధంగా పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విధంగా ఆయన రాజకీయం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలకు చెందిన సమాచారాన్ని సీఎం కేసీఆర్ సేకరించి పెట్టుకున్నారని త్వరలోనే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లకపోవడం సంక్షేమ కార్యక్రమాలను వివరించకపోవడం పార్టీ నేతలతో కలిసి ప్రజల్లోకి వెళ్లకపోవడంతో సీఎం కేసీఆర్ వాళ్ల విషయంలో కఠినంగా ముందుకు వెళ్లవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
కాబట్టి ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ నేతలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కొంతమంది సూచిస్తున్నారు. అయితే మంత్రులపై ఇప్పుడు అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై మంత్రులు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా టిఆర్ఎస్ పార్టీలో మార్పులను తీసుకు వస్తాయి ఏంటి అనేది సాగర్ ఎన్నికల తర్వాత స్పష్టత రానుంది.