పెన్షనర్‌లకు సీఎం కేసీఆర్ శుభవార్త.. వారి ఖాతాల్లో రూ. 3 లక్షలు !

-

తెలంగాణలోని పెన్షనర్లకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. తెలంగాణలో పెన్షనర్ల  పిఆర్సి బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి చెల్లించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 36 సమాన వాయిదాల్లో బకాయిలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ శుక్రవారం జీవో 1406 ను విడుదల చేసింది. 2020నాటికి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ కూడా పెరగనుంది.

kcr
kcr

గ్రాట్యుటీ ని 12 లక్షల రూపాయల నుంచి 16 లక్షల రూపాయల వరకు పెంచారు. అయితే ఈ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ దారులకు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 31, 2021 వరకు ఉన్న బకాయిలను 36 వాయిదాలలో చెల్లిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది.

అయితే తాజా జీవో ప్రకారం పింఛన్దారులకు పింఛను అలాగే గ్రాట్యుటీ బకాయిలను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అందజేస్తామని.. 2020 ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత మరణించిన పింఛనుదారులకు కుటుంబాలకు ఫిబ్రవరి 1న బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. జనవరి పెన్షన్ తో సహా పించన్ దారునికి… రూ. 1.5 లక్షల నుంచి 3 లక్షల వరకు అదనంగా పింఛన్ లభించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news