ధాన్యం కొనుగోలు చేయకపోతే యుద్ధం తప్పదు : భట్టి వార్నింగ్

-

ధాన్యం కొనుగోలు చేయకపోతే యుద్ధం తప్పదని వార్నింగ్ ఇచ్చారు సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క. ధాన్యం కొనుగోలు పై టిఆర్ఎస్, బిజెపి పార్టీలు కావాలని రైతులను ఆగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మల్లు భట్టి విక్రమార్క.. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాజకీయ క్రీడ ఆడుతున్నాయి.. కార్పొరేట్ లకు భూములను అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని నిప్పులు చెరిగారు.

ఖమ్మం జిల్లాలో వరి రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్న చందంగా తయారైందని ఆగ్రహం వ్యాఖ్యమ చేశారు. ధాన్యపు రాశులతో కల్లలు, రహదారులు నిండిపోయాయని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యాఖ్యమ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గద్దె దిగండని సవాల్ విసిరారు. టిఆర్ఎస్, బిజేపి పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడే.. రైతులకు సమస్యలు వస్తున్నాయని ఫైర్ అయ్యారు. మిల్లర్ల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news