అర్చకులు, ఇమామ్, మౌజమ్ లకు తీపి కబురు..

-

KCR-Election-challenge

తెలంగాణలోని  అర్చకులు, ఇమామ్, మౌజమ్ లకు సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించే అర్చకులకు ప్రభుత్వం ఉద్యోగుల్లానే నేరుగా ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుందని ప్రకటించారు. వీరితో పాటు మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమమ్, మౌజమ్ లకు నెలకు రూ. 5000 భృతి ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని 9000 వేల మందికి సెప్టెంబర్ 1 నుంచి భృతి అందజేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా దేవాలయాల్లోని పూజారుల వయో పరిమితిని 58 నుంచి 65కు పెంచారు.

మరిన్ని వరాలు..

ఎస్సీ, ఎస్టీలకు ఇంటి అవసరాలకు ప్రస్తుతం అందిస్తున్న 50 యూనిట్ల ఉచిత విద్యుత్ పరిమితిని 101 యూనిట్లకు పెంచారు. అదనంగా అయ్యే చార్జీలను డిస్కంలకు ప్రభుత్వమే చెల్లిస్తుంది.

రాష్ట్రంలో కొన్ని కులాల వారికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు కేటాయించారు. దీని కోసం కోకాపేట, మేడిపల్లి, ఘట్ కేసర్, అబ్దుల్లాపూర్ మెట్, ఇంజాపూర్ ప్రాంతాల్లో స్థలాలను గుర్తించారు.

36 సంచార కులాలకు కలిపి నగరంలో 10 ఎకరాల్లో రూ.10 కోట్ల వ్యయంతో సంచార ఆత్మగౌరవ భవనం నిర్మించనున్నారు.

29 మినీ గురుకులాల్లో పనిచేస్తున్న హెచ్ ఎం / వార్డెన్ కు రూ. 5వేల నుంచి రూ.21 వేలకు..సీఆర్టీలకు రూ.4 వేల నుంచి రూ.15 వేలకు.. అకౌంటెంట్లకు రూ.3500 నుంచి రూ. 10వేలు, పీఈటీలకు రూ. 4 వేల నుంచి రూ.11 వేలకు, ఏఎన్ఎం లకు రూ. 4 వేల నుంచి రూ. 9వేలకు , స్వీపర్స్ కి రూ. 2500 నుంచి రూ. 7500 కు .. వేతనాలు పెంచారు.

కేసీఆర్ నిర్ణయంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news