ఇవాళ వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు తీసుకోచ్చామని.. ఇకపై హన్మకొండ, వరంగల్ జిల్లాలు ఉండనున్నాయని కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. వరంగల్ జిల్లా ను హన్మకొండ జిల్లాగా పేరు మార్చుతామని.. దీనిపై 2-3 రోజుల్లో ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా కలెక్టరేట్‌ను త్వరలోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ పేరు కూడా మార్చాలని.. బ్రిటీష్ కాలంలో పెట్టిన పేరు అది అని వెల్లడించారు. నిన్ననే వరంగల్ జిల్లాకు వెటర్నరీ కాలేజీ మంజూరు చేశామని..చెప్పారు సీఎం కేసీఆర్. ఇది ఇలా ఉండగా.. నూతన కలెక్టర్ కార్యాలయం ముందు సీఎం కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు నిరుద్యోగ యువకులు. ఉద్యోగాలు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని.. గో బ్యాక్ సీఎం అంటూ కాన్వాయ్ అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.