తెలంగాణ రైతులకు షాక్.. వరి వేస్తే రైతు బంధు కట్ !

-

తెలంగాణ రైతులకు కెసిఆర్ సర్కార్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది. యాసంగి సీజన్ లో రైతుబంధు అమలుపై కొన్ని ఆంక్షలు పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. వరి పంట సాగు చేయని రైతులకే.. అంటే వరి స్థానంలో ఇతర పంటలు వేసిన రైతులు కే రైతుబంధు ఇచ్చే దిశగా కేసీఆర్ సర్కార్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

kcr
kcr

ప్రభుత్వం సూచనలు చేసినప్పటికీ తెలంగాణ రైతాంగం పూర్తిగా… వరి ధాన్యాన్ని పండిస్తు ఉండడంతో… ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేపు రైతుబంధు పై సీఎం కేసీఆర్.. సమీక్ష నిర్వహించనున్నట్లు కూడా సమాచారం అందుతోంది. అయితే… కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకుంటారా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటికే తెలంగాణ రైతుల లో… కెసిఆర్ సర్కార్ పై కాస్త సంతృప్తి ఉంది. ఇలాంటి తరుణంలో రైతుబంధు పై ఆంక్షలు పెడితే.. టిఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మరి సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కాగా టిఆర్ఎస్ సోషల్ మీడియాలో… అలాగే అధికార పార్టీ పత్రికల్లో.. వరి వేసిన రైతులకు రైతుబంధు ఇవ్వమంటూ వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news