యాషెస్ సిరీస్‌లో కరోనా కల్లోలం..రెండో టెస్ట్‌ నుంచి ఆస్ట్రేలియా కెప్టెన్ ఔట్

-

యాషెష్ సిరీస్ 2021 లో.. భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్.. మరి కాసేపట్లో ప్రారంభం కానుండగా… ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే ఆసీస్ జట్టుకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఈ రెండు జట్ల మధ్య సిరీస్ లోని రెండో టెస్ట్… డే నైట్ ఫార్మాట్ లో అడిలైడ్ లో ఆడాల్సి ఉంది. అయితే దీనికి ముందు ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ … బుధవారం రోజు రాత్రి కరోనా బారిన పడిన రెస్టారెంట్ వ్యక్తితో సన్నిహితంగా ఉన్నాడు.

దీంతో అతడు ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. అడిలైడ్ లోని ఓ రెస్టారెంట్ లో కమిన్స్ భోజనం చేస్తుండగా… అతని పక్కనే ఉన్న టేబుల్ పై కూర్చున్న ప్యాత్రాన్ కు కరోనా పాజిటివ్ గా ఉన్నట్లు తేలిందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. కమిన్స్ వెంటనే రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్లి అధికారులకు సమాచారం అందించాడు. ఇంకా అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ మరోసారి ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ గా అవకాశం దక్కించుకున్నాడు. అదే సమయంలో మిచెల్ నాజర్… తన టెస్ట్ ఆరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు. ఇక కమ్మిన్స్ ఏడురోజులపాటు ఐసోలేషన్ లో ఉండాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news