ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

-

ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు ఎంపీల సమావేశం జరుగనుంది. టిఆర్ఎస్ అధినేత మరియు తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పై ఈ సమావేశం లో చర్చించనున్నారు.

అలాగే ఈ నెల 25 న హైదరాబాద్‌ లోని హైటెక్స్ లో నిర్వహించనున్న ప్లీనరీ సమావేశం పై కూడా సిఎం కెసిఆర్ చర్చించనున్నారు. వచ్చే నెల 15 న వరంగల్‌ లో తలపెట్టిన తెలంగాణ విజయగర్జన సభ ఇతర అంశాలపై చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక అంతకు ముందు పార్టీ అధ్యక్ష పదవికి కెసిఆర్ తరపున నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు ఎమ్మెల్యే లక్మారెడ్డి ,బలపర్చిన పలువురు ఎమ్మెల్యేలు. అధ్యక్ష పదవి కి కెసిఆర్ తరపున నామినేషన్ దాఖలు చేసిన పార్టీ రాష్ట్ర కార్యవర్గం ప్రతిపాదించారు తక్కెళ్లపల్లి రవీందర్ రావు. అధ్యక్ష పదవికి కెసిఆర్ తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు పలువురు ఎంపీలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version