కొత్త కార్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. అదిరే ఆఫర్స్ మీకోసం..!

-

చాలా మంది కారు కొనాలని అనుకుంటూ వుంటారు. కానీ అనుకున్న వెంటనే అది అయ్యిపోదు. మీరు కూడా ఎప్పటి నుండో కారుని కొనుగోలు చెయ్యాలని భావిస్తున్నారా..? కానీ కుదరడం లేదా..? అయితే మీకు ఇదే మంచి సమయం. పండుగ సీజన్ నడుస్తోంది. కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకి గుడ్ న్యూస్. కారు కొనుగోలుపై భారీ తగ్గింపు ఆఫర్లు ఇప్పుడు అందుబాటులో వున్నాయి. మారుతీ కారు కొనాలని భావించే వారు పలు రకాల తగ్గింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

కార్లపై అదిరే ఆఫర్స్ వున్నాయి. ఇక వాటిని చూసేస్తే… మారుతీ అల్టో కారుపై రూ.43 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. అలానే ఎస్ ప్రెసో కారుపై కూడా ఆఫర్ ఉంది. దీనిపై రూ.48 వేల వరకు తగ్గింపుని పొందొచ్చు. అదే విధంగా ఈకో వెహికల్‌పై కూడా తగ్గింపు పొందొచ్చు. రూ.12500 బెనిఫిట్ లభిస్తోంది. వేగనార్ కారుపై రూ.17500 తగ్గింపు ఉండగా.. మారుతీ స్విఫ్ట్ కారుపై రూ.24,500 వరకు తగ్గింపు బెనిఫిట్స్ వున్నాయి.

అదే డిజైర్ కొనుగోలు చేయాలని అనుకుంటే రూ.19,500 తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఇది ఇలా ఉంటే వితారా బ్రెజా కారుపై రూ.17,500 తగ్గింపు బెనిఫిట్స్ ఉన్నాయి. ఆఫర్‌లో కన్సూమర్ ఆఫర్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ లాంటివి కూడా పొందొచ్చు. ప్రాంతం, కారు మోడల్, డీలర్‌షిప్ ప్రాతిపదికన డిస్కౌంట్ ఆఫర్లు కూడా మారుతూ ఉంటాయి. కనుక కారు కొనుగోలు చేయడానికి ముందే ఆఫర్ పూర్తి వివరాలు చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version