హరీశ్‌రావు పట్టుబట్టి సిద్దిపేటకు ఐటీహబ్‌ను తీసుకువచ్చిండు : కేసీఆర్‌

-

అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరీశ్‌రావుకు గతంలో వచ్చిన రికార్డు మెజారిటీని తిరగరాస్తూ.. భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్న సీఎం.. సిద్దిపేటతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘సిద్దిపేటకు రైలు వచ్చిందని.. ఇంకా ఒకటే ఒకటి తక్కువ ఉన్నది అది గాలిమోటర్‌. మంచినీళ్లు వచ్చినయ్‌.

CM KCR Speech Highlights: నేను అబద్దాలు చెబితే టీఆర్‌ఎస్‌ను ఓడించండి,  లేదంటే ప్రతిపక్షాలను తరిమికొట్టండి, కృష్ణా-గోదావరి నీటితో నల్లగొండ జిల్లా  ...

అధికారం వచ్చింది. గౌరవం వచ్చింది. మెడికల్‌ కాలేజీ వచ్చింది. ఇరుకోడు వద్ద మినీ యూనివర్సిటీ వస్తుంది. ఇంకా చాలా ఇన్‌స్టిట్యూషన్లు వస్తున్నయ్‌. ఇంజినీరింగ్‌ కాలేజీలు వస్తున్నయ్‌’ అన్నారు. ‘సిద్దిపేటకు హైదరాబాద్‌ సమీప ప్రాంతం. కంటోన్మెంట్‌ దాటితే 70 కిలోమీటర్ల దూరంలో ఉంటది. హరీశ్‌రావు పట్టుబట్టి సిద్దిపేటకు ఐటీహబ్‌ను తీసుకువచ్చిండు అన్నారు.

మంత్రి హ‌రీశ్‌రావుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఆరు అడుగుల బుల్లెట్ హ‌రీశ్‌రావు.. నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు, బ్ర‌హ్మాండంగా సిద్దిపేట‌ను అభివృద్ధి చేశార‌ని కొనియాడారు. ఇక సిద్దిపేట‌కు అన్ని వ‌చ్చాయ్.. ఒక గాలి మోటార్ రావాల్సి ఉంద‌ని కేసీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news