దళితబంధు పై సీఎం కెసిఆర్ సమావేశం

-

దళిత బంధు పథకం పై తెలంగాణ సీఎం కెసిఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే.. ప్రగతి భావన లో ప్రారంభం అయింది. దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు గా నాలుగు మండలాల పరిధిలో అమలు చేయనున్న నేపథ్యం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు సిఎం కెసిఆర్. దీంతో ఆ నాలుగు మండలాల పరిధి లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు ఈ సమావేశానికి హాజరు అయ్యారు.

మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, అచ్చం పేట -కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం., జుక్కల్ నియోజక వర్గంలోని నిజాం సాగర్ మండలాల్లో ఈ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తోంది టిఆర్ఎస్ సర్కార్. హుజూరాబాద్ తో పాటు ఈ నాలుగు మండలాల లో పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధు అమలు చేస్తున్నారు. ఇక ఇవాళ జరుగుతున్న సమావేశానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version