పల్లె, పట్టణ ప్రగతిపై స్పీడ్ పెంచిన కేసీఆర్.. జులై 1 నుంచి..!

-

హైదరాబాద్: పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇటీవల కాలంలో పల్లెల్లో పర్యటించిన ఆయన అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నిర్మించిన వాటిని ప్రారంభించారు. ఇలానే పల్లెల్లో, పట్టణాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించా‌లని నిర్ణయించారు. గ్రామాలు, పట్టణాల వారీగా చేప‌ట్టా‌ల్సిన కార్యక్రమా‌లపై అధి‌కా‌రు‌లకు దిశా‌ని‌ర్దేశం చేయనున్నారు.

ఈ మేరకు శనివారం ప్రగతి భవన్‌లో 11 గంట‌లకు జిల్లా కలె‌క్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రణా‌ళిక సంఘం ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలు శాఖల కార్యద‌ర్శులు, హెచ్‌‌వో‌డీలు, లోకల్‌ బాడీ అడి‌ష‌నల్‌ కలె‌క్టర్లు, డీపీ‌వోలు, డీఆ‌ర్డీ‌వోలు కూడా పాల్గొననున్నారు. అటవీశాఖ జిల్లా స్థాయి అధికారులు, సంరక్షకులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పల్లె, పట్టణ ప్రగ‌తిలో చే‌ప‌ట్టా‌ల్సిన కార్యక్రమాలు, హరి‌త‌హా‌రం విజ‌య‌వంతానికి తీసు‌కో‌వా‌ల్సిన చర్యలపై సమ‌గ్రంగా ఈ సమా‌వే‌శంలో చర్చించనున్నారు. ఈ సారి హరితహారంలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version