కేంద్రం, జగన్ సర్కార్ కు కెసిఆర్ వార్నింగ్ !

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ జల వివాదం లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పటికీ ఈ వివాదం ఇంకా ముగియలేదు. అయితే తాజాగా అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… ఈ జల వివాదం పై సీరియస్ అయ్యారు.అక్టోబర్ 14 నుండి అమలు లోకి గెజిట్ నోటిఫికేషన్ రానుందని… నీటి వివాదాల విషయంలో తగ్గేది లేదని అసెంబ్లీ లో స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

తెలంగాణ ప్రాజెక్టు ల పై కేంద్రం పెత్తనం తగదని.. నీటి వివాదాల విషయం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేనిపోని రాద్దాంతం చేస్తుందని ఫైర్ అయ్యారు. గెజిట్ నోటిఫికేషన్ ను కొద్దీ రోజులు వాయిదా వేయాలని నాలుగు సార్లు కేంద్రాన్ని కోరానని.. వ్యక్తిగతంగా కలిసి ఢిల్లీ పెద్దలకు వివరించానని గుర్తు చేశారు సిఎం కెసిఆర్. జల వివాదం పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని.. అవసరమై తే ఈ విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని స్పష్టం చేశారు సిఎం కెసిఆర్.