కరోనా వైరస్ సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరిని కరోనా వదలడం లేదు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కి కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ‍్యూరప్ప, యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సహా పలువురు నేతలకు కరోనా పాజిటివ్ తేలగా.. తాజాగా ఈ లిస్ట్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ చేరారు.
సీఎం కేసీఆర్ గజ్వేల్ లోని ఫాం హౌస్ లో చికిత్స తీసుకుంటున్నారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిని డాక్టర్లు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్న కేసీఆర్ కి స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలుస్తుంది. యాంటిజెన్ టెస్టులో సీఎం కేసీఆర్ కి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. గత నాలుగు రోజుల క్రితం సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు కేసీఆర్. సాగర్ టీఆర్ఎస్ అభ్యర్ది నోముల భగత్ సహా మరికొంత మంది నేతలకు ఈ కరోనా సోకినట్లు తెలుస్తుంది.