గాల్వాన్ లోయలో జరిగిన ఘటనలో మన దేశ సైనికులు 20 మంది మరణించారు.. అందులో తెలంగాణ సూర్యాపేట కు చెందిన కలనల్ సంతోష్ బాబు కూడా ఒకరు. ఇక సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యపేటలోని కల్నల్ సంతోష్ బాబు ఇంటికి వెళ్లనున్నారు.
వారి కుటుంబాన్ని పరమార్షించి.. సానుభూతి తెలిపిన అనంతరం ఆయన రూ.5 కోట్ల చెక్ ను వారి కుటుంబానికి అందించనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం కల్నల్ సంతోష్ బాబు ఇంటికి వెళ్ళిన తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి వారి కుటుంబంతో చెప్పారు. సిఎం కేసీఆర్.. వారి కుటుంబానికి 5 కోట్ల నగదుతో పాటు ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్‌లో 800 చ.గజాల నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్‌ను కేసీఆర్ ఇవాళ సంతోష్ భార్య సంతోషికి ఇవ్వనున్నారు. ఇక గాల్వాన్ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో 19 మండి సైనికులు అమరులయ్యారు.. సీఎం కేసీఆర్ అమరులైన వారి ప్రతి ఒక్క కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించనున్నారు.