చిన‌జీయ‌ర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్

-

చిన జీయర్‌ స్వామిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు కలిశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ముచ్చింతల్‌ లోని చిన జీయర్‌ స్వామి ఆశ్రమానికి సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా ఇవాళ మధ్యాహ్నం వెళ్లారు. ముచ్చింతల్‌ ఆశ్రమంలో సీఎం కేసీఆర్‌ కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం సీఎం కేసీఆర్‌ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను శాలువాలతో చినజీయర్‌ స్వామి సత్కరించి.. వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జీవ ప్రాంగణంలోని కుటీరంలో కుటీరంలో చినజీయర్‌ స్వామితో సమావేశమైన సీఎం కేసీఆర్‌.. భగవత్‌ రామానుజచార్య ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవం సందర్భంగా కుటీర ప్రాగంణంలో సీఎం కేసీఆర్‌ మొక్కలు కూడా నాటారు. కాగా.. సమతా మూర్తి విగ్రహావిష్కరణకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను మరియు ఆయా సీఎంలను చినజీయర్‌ స్వామి ఆహ్వనించిన సంగతి తెల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news