పాము కాటుతో భార్యను చంపాడు.. దోషిగా తేలాడు. కేరళ ఉత్తర కేసులో కోర్టు తీర్పు

దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన కేరళ ఉత్తర కేసులో భర్తే దోషిగా తేలాడు. కొల్లం జిల్లా కోర్టు భర్తను దోషిగా తేల్చింది. వివరాల్లోకి వెళితే కేరళ రాష్ట్రంలో అదనపు కట్నం కోసం, వేరే పెళ్లి చేసుకునేందుకు సూరజ్ అనే వ్యక్తి తన భార్య ఉత్తరను పాము కాటుతో మే 2020 లో చంపాడు. భార్య ఉత్తరకు నిద్రమాత్రలు ఇచ్చి కోబ్రాతో కాటేయించి హత్య చేశాడు. కాగా హత్యపై అనుమానం వ్యక్తం చేసిన ఉత్తర తల్లిదండ్రులు భర్త సూరజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎలాంటి ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ పై ద్రుష్టి పెట్టారు. 

ఇందులో భాగంగానే నిజమైన పాముతో కేసును రీ కన్ స్ట్రక్ట్ చేశారు. అప్పట్లో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. నిజమైన పాముతో డమ్మీ చేయిపై మామూలుగా కాటేస్తే ఎంత పెద్దగా, ఎంత లోతు గాయం ఏర్పడుతుంది.. బలవంతంగా పాముతో కాటేయిస్తే పాము గాటు, గాయం లోతు ఎంత ఉంటుందనే సాంకేతిక ఆధారాలను పోలీసులు స్రుష్టించారు. రెండు సందర్భాల్లో గాయాల తీరులో తేడాలు ఉన్నాయి. ఈ ఆధారాలతో ఉత్తరను భర్త సూరజే బలవంతంగా పాముతో కాటేయించాడని కోర్టు తేల్చింది. ఈ కేసులో సూరజ్కు 302, 307, 328, 201 ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా దోషిగా నిర్ణయించింది.