చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. “”భారతీయుడు” నటుడు మృతి !

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖ నటులను చిత్ర పరిశ్రమ కోల్పోయింది. ఇక తాజాగా చిత్ర పరిశ్రమ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాల నటుడు, నేషనల్‌ అవార్డు విన్నర్‌ నెడుమడి వేణు సోమవారం మృతి చెందారు. 73 సంవత్సరాల వేణు గత కొన్ని రోజులుగా తిరువనంత పురం లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లో లివర్‌ సంబంధిత వ్యాధి చికిత్స తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యం లోనే తాజాగా సోమవారం పూర్తి గా ఆరోగ్యం క్షీణించడంతో నెడుమడి వేణు మృతి చెందారు. ఈ విషయాన్నిస్వయంగా ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. కాగా.. శంకర్‌ దర్శకత్వం లో వచ్చిన భారతీయుడు, అపరిచితుడు చిత్రాలలో నెడుమడి వేణు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత నెడుమడి వేణు తమిళ చిత్రం సర్వం తాళమయం లో కూడా నటించాడు. ఇక ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.