మధ్యప్రదేశ్ కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆవుల కోసం కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆవుల రక్షణ కోసం ప్రచారం చేయడానికి ‘మంత్రి పరిషత్ సమితి’ మంత్రుల మండలిని ఏర్పాటు చేస్తామని సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. కొత్తగా ఆవు కేబినేట్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త మంత్రివర్గంలో పశుసంవర్ధక, అటవీ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, గృహ, రైతు సంక్షేమ శాఖల మంత్రులు పాల్గొంటారని ముఖ్యమంత్రి గతంలో చెప్పారు.
మధ్యప్రదేశ్ లోని అగర్ లోని ఆవు అభయారణ్యం వద్ద ఆవుల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. గో శాలలను స్వయం సమృద్ధిగా మారుస్తామని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గోశాలలను నిర్మిస్తామని అన్నారు. ఆవు పేడ మరియు ఆవు మూత్రాన్ని ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలో నిపుణుల నుండి సూచనలు తీసుకోబడతాయి అని చెప్పారు. పట్టణ, నగరాల్లోని నిరాశ్రయులైన ఆవులకు ఆశ్రయం కల్పించడానికి పట్టణ సంస్థల సహాయం తీసుకోబడుతుందని చెప్పారు.