నీట్ పరీక్షను పాత పద్ధతిలో నిర్వహించాలని ప్రధాని మోడీకి సీఎం మమత బెనర్జీ లేఖ

-

దేశ వ్యాప్తంగా నీట్‌ యూజీ-2024 పేపర్‌ లీకేజ్ ప్రకంపనలు రేపుతన్న వేళ….నీట్ పరీక్షను రద్దు చేయాలని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. గతంలో ఈ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేవి.. ప్రస్తుత నీట్ విధానాన్ని రద్దు చేసి..పాత పద్దతిలో పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం (జూన్ 24) ప్రధాని నరేంద్ర మోడీకి లెటర్ రాశారు. నీట్ పరీక్షల్లో పేపర్ లీకులతో నీట్ పరీక్షా విధానంపై విద్యార్థులకు నమ్మకం లేదని తెలిపారు.

2017కి ముందు రాష్ట్రాలు మెడికల్ కోర్సుల ప్రవేశ పరీక్షలను సజావుగా నిర్వహించుకున్నాయని మమత బెనర్జీ స్పష్టం చేశారు. నీట్ విధానంలో పరీక్షలు ధనవంతులకే ప్రయోజనకరంగా ఉన్నాయని మండిపడ్డారు. నీట్ పరీక్షలో భారీగా అవినీతి జరిగిందని మమతా బెనర్జీ అన్నారు.నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షను వెంటనే రద్దు చేసి మునుపటి పద్దతిలో రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా మెడికల్ పరీక్షలు నిర్వహించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మమత బెనర్జీ లెటర్ లో డిమాండ్ చేశారు. కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం నీట్ రీటెస్ట్ నిర్వహించారు.నీట్‌ పరీక్షల్లో అవకతవకలు జరగడంతో నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు తిరిగి ఆదివారం నీట్ పరీక్ష నిర్వహించింది.

Read more RELATED
Recommended to you

Latest news