డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీల బృందం సోమవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం అయ్యారు. రక్షణ శాఖ భూముల బదలాయింపుపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఈ భేటీలో చర్చించారు.హైదరాబాద్ లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు అప్పగించాలని ఆయన కోరారు.

కాగా, సాయంత్రం 6.15 గంటలకు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి వెంట కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి,మల్లురవి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య,రామసహాయం రఘురామిరెడ్డి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్ తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news