లాక్ డౌన్ నేపద్యంలో వృద్ధులకు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిరాశ్రయులకి ఆహారం దొరికక బాధపడుతున్నారని తెలుసుకున్న తమిళనాడు సీఎం పళని స్వామి ఓ చక్కటి యోజనకి శ్రీకారం చుట్టారు. అలా బాధపడుతున్నవారికి ఉచితంగా ఆహారాన్ని అందించేటట్టు అది కూడా వారు ఉన్న చోటికి లేదా వారి ఇళ్లకు డెలివరీ అందించేందుకు సీఎం సన్నాహాలు చేస్తున్నాడు. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దు అనే ఆశయంతో ముందుకు సాగుతున్నారు. సీఎం ఆదేశాలతో చెన్నైతో పాటు చెంగెల్పేట్, కాంచీపురం, తిరువల్లూరు ప్రాంతాలలో అమ్మ క్యాంటీన్లు కొనసాగుతాయన్నారు. కిచెన్ వసతులను మరింత మెరుగు చేయాలని సామర్ధత పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆకలితో ఎవ్వరూ అలమటించొద్దు..! సీఎం పళని స్వామి చక్కటి నిర్ణయం..!
-