బీఆర్ఎస్ పార్టీకి కవిత ఈరోజు మధ్యాహ్నం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రమంత్రి బండి సంజయ్ కవితపై సంచలన వాక్యాలు చేశారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఇలాంటి డ్రామాలను తెరపైకి తీసుకు వస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు.

కాళేశ్వరం అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి ఇలా డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. కవిత రాజీనామాతో రాష్ట్ర ప్రజలకు ఏమీ రాదు. కాళేశ్వరం అవినీతి గురించి మొదటి నుంచి చెబుతూనే ఉన్నాము. కానీ ఎవరో పట్టించుకోలేదు. ఇప్పుడు అదే విషయాన్ని కవిత ప్రస్తావిస్తున్నారు అంటూ బండి సంజయ్ అన్నారు. కవిత వద్ద ఆధారాలు ఉంటే సిబిఐకి ఇవ్వాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కోరారు.