పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్టార్ విందులో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ముస్లింలకు 4% రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు . ‘ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మాది . వీటిని రద్దు చేయడం మోదీ, అమిత్ వల్ల కాదు. మేం అమలు చేస్తాం అని తెలిపారు. అన్ని రంగాల్లో మైనార్టీలకు సముచిత స్థానం కల్పిస్తాం’ అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తమ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. విందులో ఉపముఖ్యమంత్రి , మంత్రులు, హైదరాబాద్ ఎంపీ అసవుద్దీన్ ఓవైసీ, మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.