ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్ అంతా మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగనుంది.ఈ టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లూ ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ హర్డిక్ పాండ్య ని గుజరాత్ టైటాన్స్ నుండి ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.అనంతరం రోహిత్ శర్మ స్థానంలో హర్డిక్ పాండ్య ను కెప్టెను చేసింది.ముంబై ఇండియన్స్ కి ఆడడం తనకు ఎప్పుడూ ప్రత్యేకమేనని ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నారు.
‘ముంబై జెర్సీ ధరిస్తేనే ప్రత్యేక అనుభూతి కలుగుతుంది అని అన్నారు. సొంత జట్టుకు ఆడడం నా అదృష్టం. అందరికీ గుర్తుండిపోయేలా, గర్వించదగ్గ క్రికెట్ ఆడతాం’ అని ఆయన పేర్కొన్నారు. 2015 పెప్సీ ఐపియల్ లో ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ ను పది లక్షలు పెట్టి కొనుకుంది. ఇక ఆ సీజన్లో ముంబై తరపున హార్థిక్ పాండ్య అద్భుత ప్రదర్శన చేశాడు . ఆ తర్వాత 2022లో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేయగా, ఆ జట్టుకి రెండు సంవత్సరాల పాటు సారథ్య బాధ్యతలు వహించాడు.