మాజీ మంత్రి కేటీఆర్ పై ఈడీ అధికారులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు సందర్భంగా తమపై ఆయన దౌర్జన్యం చేశారని ఈడీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసే క్రమంలో ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎమ్మెల్సీ కవితను ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు .శని, ఆదివారాలు కోర్టుకు సెలవు ఉంటుందనే ఉద్దేశంతోనే కావాలని శుక్రవారం వచ్చారు’ అని అన్నారు.