రేపు కాంగ్రెస్ నూతన ఎంపీలతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి

-

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నూతన ఎంపీలతో ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నూతన ఎంపీలతో సమావేశం అవ్వనున్నారు. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్ ఈ నెల 24 నుండి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

CM Revanth Reddy is a good news for Telangana lawyers

ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో రాష్ట్ర విజభన హామీలు, రాష్ట్ర ప్రయోజనాలపై అనుసరించే వ్యూహాలను కొత్తగా ఎన్నికైన ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ సీట్లు గెల్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో కొందరు కొత్తగా ఎన్నికైన వారు ఉండటంతో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలను రేవంత్ రెడ్డి వారికి వివరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news