మారు మూల పల్లె వరకు సంక్షేమ పథకాలు అందాలి అన్నదే మా లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి

-

ప్రజలు హైదరాబాద్ వరకు వచ్చే ఇబ్బంది రాకుండా ఉండేలా.. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు పోవాలి అని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారులు.. ప్రజల ను రప్పించుకోవడం కాదు.. వాల్ల దగ్గరకే అధికారులు పోవాలి. గడి లా దగ్గరకు ప్రజలు రావడం కాదు. దరఖాస్తు తో వివరాలు మాకు అందుతాయి. ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయగలుగుతాం అనేది తెలుస్తోంది.

మంచి ఆలోచన తో చేస్తున్నాం. ప్రతి మండలం రెండు గ్రూపులు.  ఒక గ్రూప్ కి MPDO మరో గ్రూప్ కి MRO బాధ్యత వహిస్తారు. గ్రామ పంచాయతీ లలో కూడా అప్లికేషన్లు ఇవ్వచ్చు. గ్రామ సభల్లో ఇవ్వకపోతే.. గ్రామ పంచాయతీ లలో ఇవ్వచ్చు. గ్రామ సభల తర్వాత కూడా.. దరఖాస్తు ఇవ్వచ్చు. ఎవరి కోసం ఎదురు చూడంకండి అని సూచించారు. ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది. గడిలు పాలన.. గ్రామాలకు తీసుకు వస్తున్నాం.  ఇచ్చిన మాట ప్రకారం.. ప్రజల దగ్గరకు పాలన పంపుతున్నాం అన్నారు. మార్పు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ప్రజా ప్రతినిధులు గా మేము లోపలికి రాలేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news