తాజాగా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా లేకుండా ఎడతెరిపి కురుస్తున్న వర్షాల కారణంగా అవసరమైతే మరిన్ని నిధులను విడుదల చేసే విధంగా, అలాగే రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం పెరుగుతున్న నేపథ్యంలో… తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప గురువారం జిల్లా ఇన్చార్జి మంత్రులకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే ఇప్పటికే యాభై కోట్ల రూపాయలు విడుదల చేశామని, ఒకవేళ ఇంకా అవసరమైతే ఎక్కువ డబ్బును విడుదల చేస్తామని తెలియజేశారు.
తాజా వర్షాల వల్ల చిక్మ మంగళూరు జిల్లాలోని ముడిగేరే సమీపంలోని కొండ చరియలు విరిగిపడ్డాయి. అలాగే కొడగు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం కారణంగా అనేక పంటపొలాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కర్నాటక లోని కొడగు జిల్లాలోని కుడిగే వద్ద కావేరి నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుందని తెలిపారు. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి అధికారులకు రాష్ట్రంలో వరదల వల్ల ఇబ్బందులు పాలైన కుటుంబాలకు 10 వేల రూపాయలు రిలీఫ్ ఫండ్ ను అందజేయాలని అధికారులకు తెలిపారు. వీటితో పాటు ఎవరికైతే పూర్తి ఇల్లు దెబ్బతిన్నాయో వారికి 5 లక్షల పరిహారాన్ని అందజేయబోతున్నట్లు తెలియజేశారు.