ఈ నెల 14న పోలవరం పర్యటనకు సీఎం జగన్

అమరావతి : ఈ నెల 14 న పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం జగన్ సందర్శించనున్నారు. ఆ రోజున ఉదయం 10 గంటలకు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు సీఎం జగన్. ప్రాజెక్టు పనులు, ఎగువ కాఫర్ డ్యాం కారణంగా గోదావరి బ్యాక్ వాటర్ ప్రభావం, ముంపు గ్రామాలు, నిర్వాసితుల అంశంపై ఈ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా పరిశీలించనున్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్​, ఇంజినీర్ ఇన్ చీఫ్ , జిల్లా ఎస్పీ పోలవరం వెళ్లారు. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర అధికారులతో ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు. సిఎం జగన్ పర్యటన ఉన్నందున అన్ని ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని ఈ సందర్బంగా ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసే దిశగా వడి వడిగా పనులు సాగుతున్నాయి. కీలకమైన వరద నీరు మళ్లింపు ఇప్పటికే ప్రారంభించారు. డిసెంబర్ 2021 నాటికి పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రాజెక్టు పనులను శరవేగంగా చేస్తోంది.